
తెల్లవారి అనగా 15 .11 .2010 ఉదయం అందరము తయారయి తుల్జభావని దర్శనానికి బయలు దేరాము. తుల్జభావని శివాజీ రాజు యొక్క కులదేవత. అతడు తన ప్రతి యుద్దనికి ముందు తుల్జభావని ని దర్శించుకొని యుద్దానికి వేల్లెవాడట. చారిత్రాత్మకంగా ఈ దేవతకు చాల ప్రాముక్యత వుంది. మేము తల్లి యొక్క నిజ రూప దర్శనం చేసుకోన్నాము.తిరిగి సత్రం కు వచ్చి వంటలు ప్రేపరే చేసి అందరం కలిసి మద్యాహ్న భోజనం చేసాము.